ఎండ తగలకుండా ఇంటికే పరిమితమయ్యారా?.. అదీ డేంజరేనట..

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగస్తులు సైతం వర్క్ ఫ్రం హోం చేస్తూ.. ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇది కూడా ఒకరకంగా చేటు తెస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తగలకుండా ఏసీల్లో ఉంటూ ఇంటికే పరిమితమైన వారికీ డేంజరేనట.. వీరిలో విటమిన్ డి లోపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువగా విటమిన్ డి లోపించిన వారేనని.. మృతుల్లో సైతం వారి సంఖ్యే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారికి కరోనా సోకినా పెద్దగా ఇబ్బందేమీ లేదని.. వారు త్వరగా వ్యాధిని జయిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఎండ బారిన పడకుండా ఉండే నగర వాసుల్లో 80 శాతం మందికి డి విటమిన్ లోపం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. విటమిన్ డి ముఖ్యంగా శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. మరోవైపు సుప్రభాత సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు విటమిన్ డిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాయి. కానీ బిజీ లైఫ్‌లో చాలా మంది ఉదయం వేళ సూర్యకాంతికి ప్రాధాన్యమివ్వట్లేదు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ డి అత్యవసరం కాబట్టి ఇక నుంచైనా రోజూ ఉదయం శరీరంపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

More News

రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

కింగ్ నాగార్జున గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

ప్లాస్మా డోనర్ పేరుతో బడా మోసం.. 200 మంది నుంచి డబ్బు వసూలు..

కరోనా కారణంగా చావుకి దగ్గరైన వ్యక్తులను బతికించేందుకు చిట్టచివరి ఆయుధంగా వైద్యులు ప్లాస్మాను ప్రయోగిస్తున్నారు.

ఎన్ 95 మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: డీజీహెచ్ఎస్

ఎన్ 95 మాస్కుల వినియోగంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) కీలక ప్రకటన చేసింది.

‘ఆచార్య’ కోసం స్పెషల్ సెట్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. తగ్గిన కేసులు..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.