'విశ్వరూపం 2' విడుదల తేది ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గ్లోబల్ టెర్రరిజం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ‘విశ్వరూపం’ (2013)కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతుల్ తివారి, కమల్ హాసన్ కథను అందించారు. ఇక కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదారెహ్మాన్ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానున్న సందర్భంలో సినిమా విడుదల తేదిని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాను ఆగస్ట్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments