'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌.  ఈ రోజు నందు పుట్టిన రోజు సందర్భంగా నందు ని 'పోతురాజు' గా పరిచయం చేస్తూ 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ కి అభిమానిగా న‌టిస్తున్నారు.

ఈ క్యారెక్ట‌ర్ చాలా వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా క‌నిపించ‌బోతున్న నందు క్యారెక్ట‌ర్ కి ధిటుగానే హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించబోతున్నారు. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందిని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.

న‌టీన‌టులు; నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్