విశ్వక్ సేన్‌ని ఆ సినిమాలో తీసేశారు.. తర్వాత ఏమైందో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల విడుదలైన ‘హిట్’తో హిట్ అందుకున్న హీరో విశ్వక్సేన్. ఈ యంగ్ హీరో కెరీర్ సాఫీగా ఏం సాగిపోలేదు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. తను, కొంత మంది స్నేహితులు కలిసి ‘వెళ్లిపోమాకే’ సినిమాను స్వంతంగా నిర్మించారు. అయితే ఆ సినిమాను విడుదల చేయలేకపోయారు. ఆ సమయంలో దిల్‌రాజు వారికి అండగా నిలబడ్డాడు. తర్వాత తరుణ్ భాస్కర్‌ను కలిసి హీరోగా ఓ ఛాన్స్ అడిగాడు. అప్పుడు ‘ఈనగరానికి ఏమైంది’ సినిమాల అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా నుండి వారం తర్వాత విశ్వక్సేన్ని తీసేశారట. అదేంటని అడిగితే ఎవరో అమ్మాయి విశ్వక్ అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడంటూ మెయిల్ పెట్టిదని డైరెక్టర్ తరుణ్ చెప్పాడట. వెంటనే ఆ మెయిల్‌ను తనకు ఫార్వర్డ్ చేయమని చెప్పి... ఆ మెయిల్ రాసిన విధానం చూసి తనకు తెలిసిన వ్యక్తే ఆ పనిచేశాడని తెలుసుకుని తనను వెళ్లి కలిసి నిజం ఒప్పుకోవాలని బ్రతిమాలాడట. అయితే ఆ వ్యక్తి వినలేదట.
అదే సమయంలో విశ్వక్ ఫేక్ మెయిల్ కథలో పెద్ద టర్నింగ్ తిరిగింది. ఏ అమ్మాయి పేరుతో అయితే నిర్మాతలకు మెయిల్ వెళ్లిందో ఆ పేరున్న అమ్మాయి.. తన పేరుని తప్పుగా ఉపయోగించుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. దాంతో ఫేక్ మెయిల్ పెట్టిన వ్యక్తి దిగి వచ్చి తన తప్పును ఒప్పుకున్నాడట. అప్పుడు నిర్మాతలు మళ్లీ విశ్వక్సేన్ను ‘ఈనగరానికి ఏమైంది’ సినిమాలో తీసుకున్నారట. అలాగే తన జీవితంలో జరిగిన ఓ పెద్ద షాకింగ్ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడట విశ్వక్ సేన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout