'హిట్' మూవీ ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా పలు వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నేచురల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా వాల్‌పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే `అ!` వంటి డిఫరెంట్ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. ఇప్పుడు నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` ఫేమ్ విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తోన్న చిత్రం `హిట్`. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తుంది.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. క్రిస్మస్ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో విశ్వక్సేన్ స్టైలిష్‌గా కనపడుతున్నారు. సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ విక్రమ్ రుద్రరాజు అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ ప్రేక్షకులను మెప్పించనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న `హిట్` సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు: విశ్వక్సేన్, రుహానీ శర్మ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com