"ముఖచిత్రం" సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్, బర్త్ డే పోస్టర్ రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,March 29 2022]

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ముఖచిత్రం సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు యువ హీరో విశ్వక్ సేన్. ఇవాళ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు.

విశ్వక్ సేన్ కు ముఖచిత్రం టీమ్ పుట్టినరోజు విశెస్ తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా..ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది. మూవీ టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో ముఖచిత్రం సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ముఖచిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ సాంకేతిక నిపుణులు - సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ - ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్

More News

RRR రేంజ్ ప్రమోషన్ Pushpa కి చేసి ఉంటె !!

సినిమా తీసాక దానిపై జనానికి ఆసక్తి ఎలా తీసుకురావాలో తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి బాగా తెలుసు.

సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్‌ గదిలో వృద్ధుడి నరకయాతన

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు .

సురేష్ గోపీ న్యూలుక్.. ‘మీది గడ్డమా? మాస్కా?’ , రాజ్యసభలో నవ్వులు పూయించిన వెంకయ్య నాయుడు

దేశ భవితను నిర్దేశించే చట్ట సభల్లో ఇటీవలి కాలంలో వాగ్వాదాలకు, పరస్పర ఆరోపణలకు, ముష్టి యుద్ధాలకు వేదికగా నిలుస్తోంది.

సెట్‌లో ‘వెల్‌కమ్ సాయితేజ్’ అంటూ ఫ్లకార్డ్స్.. కంటతడి పెట్టిన మెగా మేనల్లుడు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, రేసులో ‘అల్లు’ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది.