నవంబర్ 3న రాబోతున్న విజువల్ వండర్ 'ఏంజెల్'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు ఆరు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉంది.
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నట్లుగా నిర్మాత భువన సాగర్ తెలిపారు. ఈ పనులతో పాటు తదితర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి నవంబర్ 3న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ పర్యవేక్షకులు సింధూరపువ్వుకృష్ణారెడ్డి ప్రకటించారు.
కళ్లు చెదిరే గ్రాఫీక్స్ తో పాటు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సప్తగిరి, తాగుబోతు రమేశ్, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను కాంబినేషన్ లో ఉన్న కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించే ఎమోషన్స్, హెబ్బా గ్లామర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఏంజెల్ అలరిస్తోందని దర్శకుడు పళని చెప్పారు. అలానే ఇప్పటికే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తున్నట్లుగా ఏంజెల్ చిత్ర బృందం తెలిపింది.
యూ ట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ అప్ లోడ్ చేసిన 24 గంటల్లోపే 10 లక్షలు వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమాకు బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెసరోలియో సంగీత దర్శకత్వం వహించారు. భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ కచ్ఛితంగా శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయని ఏంజెల్ చిత్ర బృందం చెబుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout