చిక్కుల్లో 'విశ్వ‌రూపం 2'

  • IndiaGlitz, [Saturday,August 04 2018]

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం విశ్వరూం 2'. ప్ర‌పంచ వాప్తంగా ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది. ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి., రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్స్ ఈ సినిమాను నిర్మించాయి. అయితే ఈ సినిమా విడుద‌ల‌ను ఆపాల్సిందిగా సాయి మీరా చిత్ర అనే నిర్మాణ సంస్థ మ‌ద్రాస్ హైకోర్టులో దావా వేసింది.

విష‌య‌మేమంటే 2008లో మ‌ర్మ‌యోగి సినిమా కోస‌మ‌ని సాయ‌మీరా చిత్ర సంస్థ ద‌గ్గ‌ర రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ సంస్థ దాదాపు ఏడు కోట్ల రూపాయ‌లు అడిగింది. ముందు నాలుగు కోట్లు త‌ర్వాత మిగిలిన మొత్తం చెల్లించిన త‌ర్వాత మ‌ర్మ‌యోగి సినిమా రూపొంద‌లేదు. తీసుకున్న మొత్తం కూడా చెల్లించ‌లేదు. దీంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు కేసు వేశారు. మద్రాస్ హైకోర్టు సోమ‌వారం రాజ్ క‌మ‌ల్ ఇంటర్నేష‌న‌ల్ ఫిలింస్ సంస్థ‌న వివ‌ర‌ణ కోరింది. ఇప్పుడు క‌మ‌ల్ అండ్ టీం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.