విశ్వంత్, శుభశ్రీ హీరో హీరోయిన్ గా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ నూతన చిత్రం ప్రారంభం!!

  • IndiaGlitz, [Sunday,April 03 2022]

దండమూడి బాక్సాఫీస్ మరియు సాయి స్రవంతి మూవీస్ పతాకంపై విశ్వంత్,శుభశ్రీ ,ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ నటీనటులుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా కలసి నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఉగాది సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాల ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వవ్భిన స్టార్ కమెడియన్ అలీ హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం

చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టెక్నీషియ‌న్స్ అందరూ ఎంతో అనుభ‌వంతో పాటు ఎంతో ప్ర‌తిభావంతులు మా చిత్రానికి ప‌ని చేస్తున్నారు. నాపై నమ్మకంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజు నుండి ఏకధాటిగా షూటింగ్ ప్రారంభం జరుపు కుంటుంది.ఈ సినిమాకు సీనియర్ నటులు పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర నిర్మాతలు అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి మాట్లాడుతూ .. ఉగాది పర్వదినాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అథితులందరికీ మా ధన్యవాదాలు. కృష్ణ చైతన్య చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంబించాము.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం పతి ఒక్కరికే తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

నటీనటులు: విశ్వంత్, శుభశ్రీ , ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : ఈశ్వర్. ఎడిటర్ అమర్ రెడ్డి, మ్యూజిక్ : శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్ : అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి గొట్టిపాటి, నిర్మాత : అవనీంద్ర కుమార్, కథ మాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం : కృష్ణచైతన్య పి.ఆర్.ఓ : సురేందర్ నాయుడు, ఫణి (బియాండ్ మీడియా)

More News

డ్రగ్స్‌ని ఎప్పుడూ చూడలేదు.. తప్పంతా పబ్‌దే, ఏ టెస్ట్‌కైనా రెడీ : రాహుల్ సిప్లిగంజ్

హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

నిహారిక పబ్‌లో వున్న మాట నిజమే .. కానీ : పుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నాగబాబు స్పందన

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ ఘటనలో పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల పిల్లలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

బంజారాహిల్స్ రేవ్ పార్టీ.. ఆ పబ్‌లో గల్లా అశోక్ లేడు : గల్లా ఫ్యామిలీ స్టేట్‌మెంట్

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ‌రిపిన దాడిలో

ఆ పబ్‌లో నేను లేను..  నా పేరేందుకు లాగుతున్నారు, వారి పనే : పీఎస్ వద్ద హేమ రచ్చ రచ్చ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది.

విడుదలకు సిద్ధమైన "నో రామా రావన్స్ ఓన్లీ" మూవీ

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి" అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "నో రామా రావన్స్ ఓన్లీ".