విశ్వక్ సేన్ - బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం 'పాగల్'
- IndiaGlitz, [Wednesday,August 14 2019]
టాటా బిర్లా మధ్యలో లైలా ,మేం వయసుకు వచ్చాం , సినిమా చూపిస్తా మామా లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతోంది. రీసెంట్ గా ఫలక్ నమా దాస్ తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్.. ఈ మూవీ తో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.క్రేజీ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.
ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ : ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీ గా ఉంది. మా గత చిత్రం హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి,కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది.
ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ పాగల్ మూవీ బెస్ట్ క్రేజీ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..