విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘‘దాస్ కా ధమ్కీ’’.. పాగల్ కాంబినేషన్ రిపీట్

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. మార్చి 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాకు 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తుండగా.. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈలోపు కొత్త ప్రాజెక్ట్‌‌లకు సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ నటిస్తోన్న సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’ . నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అరవింద్‌ క్లాప్‌కొట్టగా అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. విశ్వక్‌ సేన్‌ సరసన నివేదా పేతురాజ్‌ మరోసారి నటిస్తున్నారు. పాగల్ సినిమాలో యూత్‌ను ఆకట్టుకున్న ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి. వ‌న్మ‌యి క్రియేష‌న్స్-విశ్వ‌క్ సేన్ సినిమాస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా క‌రాటే రాజు నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు.

More News

ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ నిర్మాణంలో విజయ్ ఆంటోనీ హీరోగా 'హత్య'

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య

నిరుద్యోగులకు తీపికబురు.. ఇవాళే 80,039 పోస్టులకు నోటిఫికేషన్, అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన

నిన్నటి వనపర్తి సభలో చెప్పినట్లుగానే .. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఫలించని రెస్క్యూ ఆపరేషన్ .. సింగరేణిలో విషాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురూ మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో గనిలో చిక్కుకుపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన

స్పెయిన్‌లో స్టెప్పులేస్తోన్న రామారావు

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..