`హిట్ 2` వదులుకోడానికి కారణం చెప్పిన విష్వక్ సేన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుల్లో విష్వక్ సేన్ తనదైన గుర్తింపును సంపాదించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది సమయంలోనే, `ఫలక్‌నుమాదాస్` చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఒకవైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా సినీ పరిశ్రమలో రాణించాలని తపన పడుతున్న ఈ యంగ్ స్టర్..హీరోగా గత ఏడాది హిట్‌తో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది `పాగల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్వక్ సేన్ పలు ఆసక్తికరమైన విషయాలనుత తెలియజేశాడు. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంవల్లనే `హిట్` సీక్వెల్ `హిట్ 2`ను వదులుకున్నానని విష్వక్ తెలియజేశాడు. అలాగే `ఫలక్‌నుమాదాస్`, `ఈనగరానికి ఏమైంది` చిత్రాలకు సీక్వెల్స్ చేయాలనే ఆలోచన ఉందన్నాడు విష్వక్ సేన్. అంతే కాదండోయ్..ఈ ఏడాది తన దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నానని తెలిపాడు. ఇక హీరోగా, `ప్రాజెక్ట్ గామీ` అనే క్లాసిక్ అడ్వెంచర్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలిపిన విష్వక్ ... `పాగల్` తర్వాత `ఓ మై కడవులే` రీమేక్‌లో నటిస్తానని, తర్వాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా తెలియజేశాడు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com