విశ్వ‌క్ సేన్‌కు క్రేజీ ఆఫ‌ర్‌

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా త‌ర్వాత త‌నే స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో హీరోగా చేసిన ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ మరింత మంచి పేరును, గుర్తింపు ఇచ్చింది. అదే స‌మ‌యంలో నాని నిర్మాత‌గా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘హిట్’ డీసెంట్ హిట్ అయ్యింది. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ కావ‌డం విశ్వ‌క్‌సేన్‌కు బాగానే క‌లిసొచ్చింది. ఇప్పుడు విశ్వ‌క్ ‘పాగ‌ల్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. మరో వైపు ‘హిట్2’ ట్రాక్‌లో ఉంది.

ఈ త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ త‌న బ్యాన‌ర్‌లో చేయ‌బోయే రీమేక్‌లో విశ్వ‌క్‌సేన్‌ను న‌టింప చేయాల‌ని భావిస్తుంది. అందుకోసం భారీ రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేసినట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా మల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘క‌ప్పేళ’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితార సంస్థ దక్కించుకుంది. ఇందులో హీరోగా నటించడానికి కోటిన్న‌ర రూపాయ‌ల మొత్తాన్ని విశ్వ‌క్‌కు సితార ఆఫ‌ర్ చేసిన‌ట్లు టాక్‌. మ‌రి ఈ ఆఫ‌ర్‌కు విశ్వ‌క్ ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని, త్వ‌ర‌లోనే దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా..

ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?

కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి..

దిల్‌రాజు అడుగు అక్క‌డ కూడా!!

తెలుగు చిత్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజుకు ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఆయ‌న అగ్ర హీరోల‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా చేయ‌డంలో ఆస‌క్తి చూపిస్తుంటారు.

‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు భారీ ఆదరణ.. దీంతో కొందరేం చేశారంటే..

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి

జీ5 ఓటీటీ నెక్స్ట్ తెలుగు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్

హైదరాబాద్, 11 జూలై 2020: స్ఫూర్తివంతమైన 'లూజర్' నుండి 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' వరకు... బెస్ట్ కంటెంట్‌ను తెలుగు వీక్షకులకు అందించడంలో జీ5