Family Dhamaka:ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా : విశ్వక్‌సేన్ హోస్ట్‌‌గా ఆహాలో రియాలిటీ షో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,August 29 2023]

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. సీనియర్ హీరో హీరోయిన్లు , నటుడు, ప్రతిభావంతులకు ఈ పరిశ్రమ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు కూడా దోహదం చేస్తోంది. దీంతో బడా స్టార్లు సైతం తమ స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి ఓటీటీల్లో అవకాశాలను అందిపుచ్చుకుని తమ సత్తా చాటుతున్నారు. ఇక అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో నడుస్తోన్న ‘‘ఆహా ’’ తెలుగువారికి తిరుగులేని వినోదాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫ్లాట్‌ఫాం నుంచి మరో రియాలిటీ షో ప్రారంభం కానుంది. అదే ‘‘ఫ్యామిలీ ధమాకా’’. సెప్టెంబర్ 8 నుంచి ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. కుటుంబాల మధ్య అనుబంధాలను తెలియజేస్తూ.. భావోద్వేగాలు , సవాళ్ల కలయికగా ఈ షోను తీర్చిదిద్దారు నిర్వాహకులు.

అన్నట్లు ఈ రియాలిటీ షోకు యువ హీరో విశ్వక్‌సేన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన హోస్ట్ కావడంతో ఈ షోకు విపరీతమైన బజ్ వచ్చేసింది. 15 ఎపిసోడ్ల పాటు ఈ షో సాగనుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో విశ్వక్ స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చి.. కుటుంబాలను ప్రశ్నలు అడగటం చూడొచ్చు. ‘‘వెల్‌కమ్ టూ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ షో ఎవర్.. ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా’’ అంటూ ఈ షోను పరిచయం చేశారు.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆహా వారి ఫ్యామిలీ ధమాకా షోకు తాను హోస్ట్‌గా చేయడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిశానని.. చాలా ఆనందంగా, థ్రిల్లింగ్‌గా వుందని విశ్వక్ వ్యాఖ్యానించారు. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిశానని.. ఈ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్‌సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వీఎస్ 10 చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా వున్నాడు. ఇలాంటి దశల్లో ఓటీటీల్లోనూ తన సత్తా చాటేందుకు విశ్వక్ సిద్ధమవ్వడం విశేషం.

More News

Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే.

NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా

Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది.

Kangana Ranaut:నా కెరీర్‌లో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేయలేదు - కంగనా రనౌత్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’.

Nara Lokesh:నోరుజారిన ఫలితం : నారా లోకేష్‌పై విమర్శల వర్షం.. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ, వైసీపీ తేలిగ్గా వదలదు

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది.