ఆస్ట్రేలియా మోడల్ తో విష్ణు....

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

మంచు విష్ణు హీరోగా గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ల‌క్కున్నోడు. ఈ సినిమా ఫిభ్ర‌వ‌రి 3న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియాకు చెందిన మోడ‌ల్ లూసియా నికోల‌స్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. రీసెంట్ టైమ్స్‌లో లారిస్సా బోనిసా, న‌థాలియా కౌర్‌, గ్రాబియ‌ల్ వంటి విదేశీ మోడ‌ల్స్ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించి తెలుగు మాస్ ఆడియెన్స్‌ను అల‌రించారు. ఇప్పుడు అదే బాట‌లో లూసియా నికోల‌స్ తెలుగు ఆడియెన్స్ ను ఆక‌ట్టుకోనుంది. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.