మహేష్ కు పోటీగా విష్ణు..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న `స్పైడర్` ఆగస్ట్ 11న విడదలకు సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ సినిమా అంటే ఆ వీక్‌లో మరో సినిమా సినిమాకు మార్గం ఉండనట్టే, అంతే కాకుండా మహేష్ సినిమాతో పోటీకి రావడం గురించి కూడా ఆలోచిస్తారు.
కానీ మంచు విష్ణు మాత్రం తను చేస్తున్న తాజా బై లింగ్వువల్ `వోటర్` చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడట. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల చేస్తారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వోటర్ సినిమా తెరకెక్కుతోందని జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ పూదోట సినిమాను నిర్మిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com