Vishnu:మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలు: విష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. 'బాహుబలి' నుంచి మన సినిమాల హద్దులు చెరిగిపోయాయి. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మా అసోసియేషన్ సిద్ధమైంది. ఈ విషయం తెలియజేస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలో విష్ణు మాట్లాడుతూ "మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డ్ రావడం, జై బాలయ్య అనే మాట ఎంతో పాపులారిటీ సంపాదించుకోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ రావటం, ఇండియన్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఎదగడం, మహేష్ రాజమౌళి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రాబోతుండటం, కీరవాణి-చంద్రబోస్ గారికి ఆస్కార్, ఇలా తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ అవుతూ వస్తుంది. అమితాబ్, అనిల్ కపూర్ లాంటి నటులను తెలుగు వారే పరిచయం చేశారు. అందుకే 90ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్‌ని ఇప్పుడు చేయడం కరెక్ట్ అని మేము భావిస్తున్నాము.
అందుకనే మలేషియాలో ‘నవతిహి’ పేరిట చారిత్రాత్మక ఈవెంట్‌ని చేయాలని మా అసోసియేషన్ తరపున నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయం గురించి ఫిలిం ఛాంబర్‌తో కూడా మాట్లాడడం. టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు రోజులు సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారిని ఇందుకు సపోర్ట్ చేయాలని విన్నవించుకున్నాము. వారు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి కూడా ఈ ఈవెంట్‌కి సపోర్ట్ వస్తుంది. వారు పాల్గొంటామని తమ సపోర్ట్‌ని తెలియజేస్తున్నారు. జులైలో ఈ వేడుకని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పరిశ్రమ పెద్దలను సంప్రదించి ఈవెంట్ డేట్స్ అనౌన్స్ చేస్తాము. తెలుగు సినిమా ఘనకీర్తిని తెలిపేలా ఈ ఈవెంట్ ఉంటుంది" అని తెలిపారు.
కాగా 75 సంవత్సరాలు సందర్భంగా 2007లో ‘వజ్రోత్సవం’ వేడుకను తెలుగు సినిమా పరిశ్రమ తరపున ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. హీరోలు అంతా కలిసి డ్యాన్స్‌లు వేస్తూ, స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ 90 సంవత్సరాలను పురస్కరించుకుని ‘నవతిహి' పేరిట వేడుకను నిర్వహించనుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments