బీజేపీలోకి ఊహించని నేత.. కమలనాథులతో చర్చలు!

  • IndiaGlitz, [Monday,September 09 2019]

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు, మాజీలు ఆయా పార్టీలకు టాటా చెప్పేసి కాషాయ కండువా కప్పుకున్న విషయం విదితమే. అయితే బీజేపీలో చేరికల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ నాయకులతో విష్ణువర్ధన్ రెడ్డి చర్చలు జరిపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

కాగా.. పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే. ఈయన హయాంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ ఆయన హయాంలో చేసిన మంచి పనుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు.. పీజేఆర్ కాంగ్రెస్ కరుడుగట్టిన నేతగా ఉన్నారు. ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన విష్ణు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఊహించని విధంగా ఆయన కాంగ్రెస్‌ను కాదని బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకోవడం గమనార్హం. ఈ చేరిక ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇంతవరకూ ఈ చేరికపై విష్ణు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ.. సన్నిహితులతో మాట్లాడించడం కానీ చేయలేదు.

More News

హీరో కార్తికేయ కొత్త చిత్రం '90 ఎంఎల్‌'

`ఆర్‌.ఎక్స్.100` సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌డి చేసింది.

నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దే వద్దు!

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ ప్రాంతంలో కేంద్రం తలపెట్టిన యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు జీవవైవిధ్యం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అనీల్ డైరెక్షన్‌కు మహేశ్ ఫిదా.. మరో సినిమాకు రెడీ!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

కేసీఆర్ మోసం చేశారు.. నాయిని షాకింగ్ కామెంట్స్!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్.. చంద్రబాబు బినామీ.. ఎవర్నీ వదిలిపెట్టం!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.