బీజేపీలోకి ఊహించని నేత.. కమలనాథులతో చర్చలు!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు, మాజీలు ఆయా పార్టీలకు టాటా చెప్పేసి కాషాయ కండువా కప్పుకున్న విషయం విదితమే. అయితే బీజేపీలో చేరికల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ నాయకులతో విష్ణువర్ధన్ రెడ్డి చర్చలు జరిపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కాగా.. పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే. ఈయన హయాంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ ఆయన హయాంలో చేసిన మంచి పనుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు.. పీజేఆర్ కాంగ్రెస్ కరుడుగట్టిన నేతగా ఉన్నారు. ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన విష్ణు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఊహించని విధంగా ఆయన కాంగ్రెస్‌ను కాదని బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకోవడం గమనార్హం. ఈ చేరిక ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇంతవరకూ ఈ చేరికపై విష్ణు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ.. సన్నిహితులతో మాట్లాడించడం కానీ చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout