నిన్న వర్మ, విష్ణు నేడు సాయి కొర్రపాటి...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకురామయ్య...ఇలా విజయవంతమైన చిత్రాలను అందించి అనతి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్ననిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం. విజయవంతమైన చిత్రాలను అందించడంతో పాటు పంపిణీ రంగంలో ప్రవేశించి చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి. నేను ప్రొడ్యూసర్ అంటూ కొత్త పద్దతిలో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే...సినిమాని కొనుక్కుని ఎవరైనా తమ ఊరులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరైతే తమ ఊరులో ప్రదర్శించడానికి సినిమా హక్కలు కొనుక్కుంటారో వారే ఆ ఊరులో ఆ సినిమాకి ప్రొడ్యూసర్. దీని కోసం నేనుప్రొడ్యూసర్ అనే డాట్ కామ్ ఏర్పాటు చేసారు. వారాహి చలనచిత్రం రిలీజ్ చేస్తున్నగుంటూరు టాకీస్ సినిమాని ఈ పద్దతిలో రిలీజ్ చేయనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పాత పద్దతే. గతంలో రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు కాంబినేషన్లో రూపొందిన అనుక్షణం మూవీని ఈ పద్దతిలోనే రిలీజ్ చేసారు. ఇప్పుడు సాయి కొర్రపాటి అదే పద్దతి ఫాలో అవుతున్నారు. మరి...సాయి కొర్రపాటికి నేనే ప్రొడ్యూసర్ అనే కొత్తపద్దతి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout