మంచు విష్ణు, రాజ్ తరుణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- IndiaGlitz, [Saturday,January 16 2016]
మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేస్ నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయడం విశేషం. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కుమారి 21 ఎఫ్ హీరోయిన్ రాజ్ తరుణ్ తో మళ్లీ నటిస్తుండడం విశేషం.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా విష్ణు, రాజ్ తరుణ్ కి సక్సెస్ అందిస్తుందేమో చూద్దాం.