విష్ణుతో అమైరా...

  • IndiaGlitz, [Sunday,November 29 2015]

త‌మిళ అనువాద చిత్రం అనేకుడు'తో తెరంగేట్రం చేసిన హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇషాన్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం రోగ్‌'లో ఓ హీరోయిన్‌గా అమైరా న‌టిస్తుంది. అలాగే ఇప్పుడు అమైరా మంచు విష్ణు చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతుంద‌ట‌. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు.

విష్ణు స‌ర‌సన అమైరా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అవికాగోర్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. ఒక‌వేళ అవికాగోర్‌కు కుద‌ర‌క‌పోతే హేబా ప‌టేల్‌ను అయినా ట్రాక్‌లో తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దేనికైనా రెడీ, క‌రెంట్ తీగ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిచ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది.

More News

రాజమండ్రికి మనోజ్...

బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'.

'123' అంటున్న సందీప్ కిషన్.....

'టైగర్ ' సక్సెస్ తో సందీప్ కిషన్ ఇప్పుడు తన తదుపరి చిత్రంలో బిజీగా ఉన్నాడు.మలయాళం,తమిళం,మరాఠీల్లో విజయవంతమైన చిత్రం 'నేరమ్ 'రీమేక్ సినిమాయే ఇది.

డిసెంబర్ లో 'జతగా...' ఆడియో విడుదల

ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రాలను అందిస్తుంటారు సురేశ్ కొండేటి.ఆయన విడుదల చేసే చిత్రాలన్నీ కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి.

నరేష్ 50వ సినిమా నిర్మాత కావడం గౌరవంగా ఫీలవుతున్నా - విష్ణు

డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.

ఆ డైరెక్ట‌ర్ కోసం అఖిల్ వెయిటింగ్..

అక్కినేని అఖిల్ న‌టించిన తొలి చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో అఖిల్ రెండో సినిమాతో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాలి.