భారీ వర్ష బాధితులకు విష్ణు మంచు సహాయం
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో మంచు విష్ణు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విష్ణు అండ్ టీం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
హైదరాబాద్ లోని విష్ణు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ క్యాంపస్ లోని 20 పైగా బ్రాంచీల వారి సహకారంతో బాధిత ప్రాంత ప్రజలకు ఆహారం, నీరు, బ్లాంకెట్స్ అందచేస్తున్నారు. అలాగే ఈ క్యాంపస్ కు చెందిన 20 పైగా బ్రాంచీల్లో జనరేటర్స్ సహాయంతో స్పెషల్ చార్జింగ్ పాయింట్స్ ను అరేంజ్ చేశారు. దీని ద్వారా మొబైల్స్, మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎవరైనా సహాయం కావాలనుకుంటే నిజాంపేట, కె.పి.హెచ్.బి కాలనీ, నాచారం, మియాపూర్ లోని స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలను సంప్రదించాలి. శనివారం మొదలు మూడు రోజుల వరకు ప్రజలకు విష్ణు అండ్ టీం సపోర్ట్ అందిస్తారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవలో భాగమైన విష్ణు ప్రస్తుతం లక్కున్నోడు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాలకు వరదమయమైన హైదరాబాద్ లో సాధారణ పరిస్థితలు నెలకొనాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com