విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' రిలీజ్ జనవరి 26
Send us your feedback to audioarticles@vaarta.com
'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది.
దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా విడుదల తేదీని నేడు ప్రకటించారు నిర్మాతలు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments