విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
విష్ణు మంచు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఆచారి అమెరికా యాత్ర` చిత్ర ఫస్ట్ లుక్
విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది.
'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి వినోదభరిత కామెడీ చిత్రాలను అందించిన విష్ణు మంచు, జి. నాగేశ్వర్ రెడ్డిలు మళ్ళి జత కట్టడంతో 'ఆచారి అమెరికా యాత్ర' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 23 న విడుదల చేస్తామని వెల్లడించారు నిర్మాతలు. ఆడియో మరియు ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments