విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Friday,November 10 2017]

విష్ణు మంచు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్

విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది.

'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి వినోదభరిత కామెడీ చిత్రాలను అందించిన విష్ణు మంచు, జి. నాగేశ్వర్ రెడ్డిలు మళ్ళి జత కట్టడంతో 'ఆచారి అమెరికా యాత్ర' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 23 న విడుదల చేస్తామని వెల్లడించారు నిర్మాతలు. ఆడియో మరియు ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

More News

'అజ్ఞాత‌వాసి' పాట‌లు అప్పుడేనా?

'అజ్ఞాత‌వాసి' పాట‌లు గురించి ఈ మ‌ధ్య చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. బైట‌కొచ్చి చూస్తే అనే సింగిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 'అజ్ఞాత‌వాసి' పాట‌ల మీద ఆసక్తి ఎక్కువైంది.

రామ‌య్య స‌న్నిధిలో తార‌క్‌

భ‌ద్రాద్రి రాముల‌వారి స‌న్నిధిలో ఎన్టీఆర్ శుక్ర‌వారం గ‌డిపారు. భ‌ద్రాద్రి రామాల‌యానికి ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లారు. చిన్న‌త‌నంలో ఆయ‌న రాముడిగా న‌టించిన విష‌యం తెలిసిందే.

సునీల్ 2 కంట్రీస్ డిసెంబర్ విడుదల

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి తెలుగులోనూ "2 కంట్రీస్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

5 రోజుల్లో రూ.15 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకున్న'పిఎస్‌వి గ‌రుడ‌వేగ'

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన డా.రాజ‌శేఖ‌ర్ ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

అస‌భ్య‌క‌రంగా ఉండ‌దంటున్నమేక‌ర్‌

అల్లా వుద్దీన్ ఖిల్జీకి, రాణి ప‌ద్మావ‌తికి మ‌ధ్య ఎలాంటి అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాల‌నూ చిత్రీక‌రించ‌లేద‌ని, త‌నను రాణి ప‌ద్మావ‌తి క‌థ ఎంతో ఇన్‌స్ప‌యిర్ చేయ‌బ‌ట్టే ఈ సినిమాను చేశాన‌ని అంటున్నారు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి.