Kannappa:'కన్నప్ప' ఫస్ట్ లుక్‌లో అదరగొట్టిన విష్ణు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శివుడికి వీరభక్తుడైన కన్నప్ప జీవితచరిత్ర అధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. కన్నప్ప గెటప్‌లో విష్ణు ఓ భారీ జలపాతం కింద విల్లును ఎక్కుపెట్టినట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవలే న్యూజిలాండ్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా మూవీ యూనిట్ తెలిపింది. ఈ రెండో షెడ్యూల్లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఈ మూవీ కోసం కష్టపడుతున్నారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ‘మహాభారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ చేస్తుండగా.. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, కిచ్చా సుదీప్, మోహన్ బాబు లాంటి భారీ తారాగణం నటిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు ఇందులో నటిస్తున్నారు. విష్ణు ఐదేళ్ల కుమారుడు మంచు అవ్రామ్ ఈ మూవీ ద్వారా వెండితెర అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com