విష్ణు హీరోయిన్ మారిపోయింది...

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నాడు. పంజాబీలో విజ‌యవంత‌మైన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు రాజ్ త‌రుణ్ కూడా న‌టిస్తున్నాడు. రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న హేబా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే మంచు విష్ణు స‌ర‌స‌న ముందు అమైరా ద‌స్త‌ర్‌ను హీరోయిన్‌గా అనుకున్న‌ప్ప‌టికీ అమైరా హాలీవుడ్ మూవీతో పాటు ప‌లు చిత్రాలకు అల్రెడి డేట్స్ కేటాయించేసి ఉండ‌టంతో ఇప్పుడు డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక సినిమాకి రెడ్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. దాంతో నిర్మాత‌లు ఇప్పుడు విష్ణు స‌ర‌స‌న స‌ర‌దా చిత్రంలో న‌టిస్తున్న సోనారిక‌నే హీరోయిన్‌గా ఓకే చేశార‌ట‌.