బిజెపీ నేతపై విష్ణు మంచు మండిపాటు..
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన జిఎస్‌టి ట్యాక్స్ పై మెర్సల్ చిత్రంలో తప్పుగా చూపించారంటూ ఇప్పుడు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. బిజెపి నాయకులు ఈ విషయంపై తప్పు పడుతుంటే, పలువురు వేరే పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు రజనీకాంత్, కమల్ సహా పలువురు మెర్సల్‌కు తమ మద్ధతు తెలిపారు.
కాగా దీనిపై మాట్లాడిన నరసింహారావు అనే బిజెపి నేత చాలా మంది నటులకు విషయ పరిజ్ఞానం ఉండదని కామెంట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు స్పందించారు. సినిమా స్టార్లకు జనరల్ నాలెడ్జ్ లేదనుకుంటే .. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా? మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దు. వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత ఉన్నారు.ఓ అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. క్రిస్టియన్‌ని వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ హిందుత్వాన్ని బాగా నమ్ముతాను. హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతాను. నాకు భాజపాపై గౌరవం ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిని అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్హాన్ అక్తర్ ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డాడు. అసలు సినిమా నటీనటులు తమ అభిప్రాయాన్ని కూడా చెప్పకూడదనడం ఎంత వరకు కరెక్టో తెలియడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com