విష్ణు, జె.డి మధ్య మాటల్లేవ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం డైనమేట్. ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్. ఈ చిత్రంలో విష్ణు హీరోగా నటించగా, జె.డి విలన్ గా నటించారు. అయితే తమిళంలో రూపొందిన అరిమ నంబి చిత్రాన్నే తెలుగులో డైనమేట్ గా రీమేక్ చేసారు. తమిళ చిత్రంలో జె.డి విలన్ గా నటించారు. తెలుగులో కూడా విలన్ పాత్రను జె.డి తోనే చేయించారు. ఈ సినిమాలోనటించేందుకు ముందు జె.డి ఒప్పుకోలేదట. మోహన్ బాబు, విష్ణు ఖచ్చితంగా నువ్వే చేయాలని పట్టుబట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదట.
ఈ విషయాన్ని స్వయంగా జె.డి నే మీడియాకి చెప్పాడు. ఇక అసలు విషయానికి వస్తే..షూటింగ్ జరుగుతున్న సమయంలో విష్ణు, జె.డి పక్కపక్కనే ఉన్నా... వారిద్దరి మధ్య మాటల్లేవ్...మాటల్లాడుకోవడాలు లేవట. ఎందుకు మాట్లాడుకోలేదు అని జె.డి ని అడిగితే...మా మధ్య గొడవలు ఏమీ లేవు. కానీ మేము షూటింగ్ స్పాట్ మాట్లాడుకోవడానికి కారణం మేమిద్దరం అంతలా ఒకరికొకరం క్యారెక్టర్స్ లో ఇన్ వాల్వ్ అయిపోయాం అంటున్నాడు జె.డి. నిజమేనంటారా..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments