విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,June 22 2020]

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'చ‌క్ర‌'. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగా కాసేప‌టి క్రితం 'చ‌క్ర'‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు యాక్ష‌న్ హీరో విశాల్. ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు 'చ‌క్ర' గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ 'అభిమ‌న్యుడు' త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్ ప‌వ‌ర్‌ఫుల్ మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర,మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

More News

ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాపై అమృత స్పందించలేదు: బాలస్వామి

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తను తీయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

సామూహిక వ్యాప్తి దిశగా తెలంగాణ.. ప్రస్తుతానికి ఏపీ సేఫ్

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా కొనసాగుతోందా? అంటే ఇండియా ఇన్ పిక్సల్స్ అవుననే అంటోంది.

మీ సిల్లీ జోకులను చూడటానికి బతికే ఉన్నాం: నయన్ విఘ్నేష్

ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా ముందుంటుంది. కరోనా స్ప్రెడ్డింగ్ ఏ రేంజ్‌లో ఉందో..

ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చకుంటే వారి మానాన వారిని వదిలెయ్యండి: డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో కొందరి ప్రవర్తనను ప్రశ్నించింది. ఇండస్ట్రీలో అందలమెక్కించే భుజాలే కాదు..

ఢిల్లీలో హై అలెర్ట్.. ఇప్పటికే ఉగ్రవాదులు చేరుకున్నారన్న నిఘా వర్గాలు

ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చంటూ నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.