తల్లి పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్న హీరో...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

తమిళ హీరో విశాల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. తన తాహతుకు తగిన విధంగా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తానని ఇది వరకే 16 మంది అమ్మాయిల చదువు కోసం అల్రెడి సహాయం చేశాడు.

తాజాగా ఈ సేవాకార్యక్రమాలను కంటిన్యూ చేయాలనే సంకల్పంతో తల్లి పేరు మీద దేవి సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్' ను స్టార్ట్ చేస్తున్నాడట. ఈ ఫౌండేషన్ వెనుకబడిన, పేద కుటుంబాలకు చెందిన మెరిట్ విద్యార్థినులకు చదువు కోసం వెన్నుదన్నుగా నిలుస్తుందని, అందుకోసం తన ఫ్యాన్స్ తనకు సపోర్ట్ గా ఉంటారని విశాల్ భావిస్తున్నాడట.