చైతు హీరోయిన్ తో విశాల్ రొమాన్స్.

  • IndiaGlitz, [Monday,July 25 2016]

మాస్ హీరో విశాల్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం పందెంకోడి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి విశాల్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది. దీంతో పందెంకోడి చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని విశాల్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో పందెంకోడి ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయ‌డం... ఆత‌ర్వాత వేరే కార‌ణాల వ‌ల‌న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని విశాల్ ప్ర‌క‌టించడం తెలిసిందే.

ఎట్టేకేల‌కు విశాల్ - లింగుస్వామి కాంబినేష‌న్లో పందెంకోడి 2 మూవీ రూపొందించ‌డానికి అంతా సెట్ అయ్యింది ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఫేమ్ మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. ఈ క్రేజీ మూవీని సెప్టెంబ‌ర్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక సీక్వెల్ అంటే అంచ‌నాలు ఏర్ప‌డ్డం స‌హ‌జం. అందుచేత అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు తెలుగు, త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించేలా డిఫ‌రెంట్ స్ర్కిప్ట్ తో పందెంకోడి 2 తెర‌కెక్కించ‌నున్నారట‌. మ‌రి...పందెంకోడి 2 విశాల్ కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

More News

తేజు తిక్క అప్ డేట్

సాయిధ‌ర‌మ్ తేజ్, లేరిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో, హీరోయిన్స్ గా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్నతిక్క ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

నాని మూవీ రిలీజ్ డేట్‌

'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', ఇప్పుడు `జెంటిల్‌మ‌న్` ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న హీరో నాని ఇప్పుడు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో విశాల్...

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్హిట్ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మాస్విశాల్కొత్త చిత్రం కత్తిశండై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటోంది.

శర్వానంద్ తో అక్ష..

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్, అత్తారింటికి దారేది...

ఇప్పుడు సూర్య అవకాశం ఇస్తాడంటారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి సినిమాను రూపొందించిన దర్శకుడు పా రంజిత్ కు విడుదలకు ముందు ఉన్న క్రేజే వేరు. విడుదల తర్వాత ప్రశంసలు ఎన్ని వచ్చాయో, విమర్శలు కూడా అన్నే వచ్చాయి.