కోర్టుకు విశాల్...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విశాల్ చెన్నై ఎగ్మోర్ కోర్టుకు హాజరయ్యారు. 2016లో సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదనే కారణంతో అధికారులు విశాల్‌కు నోటీసులు పంపారు. అయితే విశాల్ సర్వీస్ ట్యాక్స్ కార్యాలయానికి హాజరు కాలేదు. దీంతో సదరు అధికారులు ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు.
కేసు విచారణకు రావడంతో విశాల్ కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విశాల్ తరపు న్యాయవాదులు ఫార్మాలిటీ కోసం విశాల్ కోర్టుకు హాజరయ్యారని .. సర్వీస్ ట్యాక్స్‌ను ఈ నెల 26న చెల్లిస్తామని కోర్టుకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ గురువారం విశాల్ నటించిన 'పందెంకోడి 2' తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments