విశాల్ అప్పుడే డబ్బింగ్ మొదలేట్టేశాడు....

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై సురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో జి.హ‌రి నిర్మిస్తున్న చిత్రం 'క‌త్తి సండై'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఒక్క‌డొచ్చాడు' అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. సెప్టెబంర్ 3న పాటల చిత్రీకరణకు టీం రష్యాకు వెళుతుంది. అయితే విశాల్ ఉన్న కాస్తా గ్యాప్ ను కూడా సినిమాకే వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన సినిమాలో తన పార్ట్ కు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టేశాడు. అక్టోబర్ 9న ఆడియో, సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 29న న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.