విశాల్ - తమన్నా మూవీకి పవర్ ఫుల్ టైటిల్..

  • IndiaGlitz, [Monday,July 25 2016]

విశాల్ - త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ఈ చిత్రానికి సూర‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. త‌మిళ్ లో ఈ చిత్రాన్ని విశాల్ నిర్మిస్తుంటే...తెలుగులో ఈ మూవీకి హ‌రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త‌మిళ్ లో క‌త్తి సందై టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఒక్క‌డొచ్చాడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఒక్క‌డొచ్చాడు అనే టైటిల్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది అని హీరో విశాలే టైటిల్ ఫిక్స్ చేసార‌ట‌.ఇదిలా ఉంటే...

విశాల్ న‌టించే మ‌రో చిత్రం పందెంకోడి 2 షూటింగ్ సెప్టెంబ‌ర్ లో ప్రారంభించ‌నున్నారు.

More News

నైట్ క్లబ్ బిజినెస్ లోకి బన్ని...

సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సినిమాలతో పాటు హోటల్స్, పబ్స్, ఎయిర్ వేస్ సహా పలు బిజినెస్ లలో పార్టనర్స్ గా ఉంటున్నారు. మరి కొందరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నాడు.

కమల్ హెల్త్ గురించి ఇంపార్టెంట్ అప్ డేట్..

యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ ఇటీవల చెన్నైలోని తన నివాసం లో మెట్ల పై నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కమల్ కాలికి ఆపరేషన్ చేయడం జరిగింది.

200కోట్లు దాటేసిన 'కబాలి'

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఇండియా సహా 30 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్ల మార్కును దాటేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

బాహుబ‌లి అయినా...పెళ్లి చూపులు అయినా ఆడియ‌న్స్ చూసేది అదే - నిర్మాత రాజ్ కందుకూరి

విజయ్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ‌, నందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై రాజ్ కందుకూరి, య‌స్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు.

అంప‌శ‌య్య కోసం న‌గ్న దృశ్యాలు చిత్రీక‌రించిన మాట వాస్త‌వ‌మే - ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని

అందరూ ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్‌ ఫిల్మ్‌ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం’’ అని దర్శకుడు ప్రభాకర్‌ జైని అన్నారు.