తెలుగోడు అంటూ నన్ను ఓడించేందుకు చాలా ప్రయత్నాలు చేసారు - హీరో విశాల్
Thursday, May 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ - శ్రీదివ్య జంటగా నటించిన చిత్రం రాయుడు. ఈ చిత్రాన్ని ముత్తయ్య తెరకెక్కించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందిన రాయుడు చిత్రాన్ని తమిళ్ లో ఈ నెల 20న, తెలుగులో ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో విశాల్ తో ఇంటర్ వ్యూ మీకోసం....
రాయుడు కాన్సెప్ట్ ఏమిటి..?
ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు రాయుడు. మార్కెట్ లో బస్తాలు మోసే క్యారెక్టర్ చేసాను. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుంది. ఒక లోకల్ పొలిటీషియన్ కి మార్కెట్ లో బస్తాలు మోసే యువకుడికి మధ్య జరిగే వార్ ఈ రాయుడు కథ. నా గెటప్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాడు వీడు సినిమా తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నేను చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రాయుడు హైలైట్స్ ఏమిటి..?
ఈ చిత్రానికి అనిల్ అరసు ఫైట్స్ కంపోజ్ చేసారు. రోప్ లేకుండా రియల్ గా ఉండేలా ఫైట్స్ చేసాం. ఓ పది మంది నిజంగా కొట్టుకుంటే..ఎలా ఉంటుందో అలాగే ఈ చిత్రంలో చూపించాం. ఫైట్స్ కి మంచి పేరు వస్తుంది. అలాగే నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో ఊహించని విధంగా స్ర్కీన్ ప్లే ఉంటుంది. ఫైట్స్ - స్ర్కీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయి.
ఈమధ్య తెలుగు, తమిళ్ రెండింటిలో ఒకేసారి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే..మీకు సరైన డేట్ కుదరలేదు అనుకుంట..?
అవునండి..నా సినిమాని తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేద్దాం అనుకుంటే కుదరలేదు. ఈ నెల 20న రాయుడు తమిళ్ వెర్షెన్ రిలీజ్ చేస్తున్నాం. అదే రోజు తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుంటే...బ్రహ్మోత్సవం రిలీజ్ అవుతుంది. అందుచేత అదే రోజు రిలీజ్ చేయాలనుకుంటే తక్కువ ధియేటర్స్ లో రిలీజ్ చేయాలి. అది నాకు ఇష్టం లేదు. పైగా నాకు ఈ సినిమా పై పూర్తి నమ్మకం ఉంది. అందుచేత తమిళ్ లో ఈ నెల 20న, తెలుగులో ఈ నెల 27న రాయుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
తమిళనాడులో ఎన్నికల హడావిడి ఎలా ఉంది..?
ఫస్ట్ టైమ్ తమిళనాడు ఎన్నికల్లో కోటి మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ప్రచారం చేస్తున్నాం. కానీ...నడిగర సంఘం ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు.
ఇంతకీ...తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు..?
ప్రజలకు మంచి చేయాలనుకునే పార్టీయే గెలుస్తుంది (నవ్వుతూ...)
నడిగర సంఘంకు జరిగిన ఎన్నికలు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి..? ఇరు వర్గాల మధ్య సీరియస్ వాతావరణం ఏర్పడ్డానికి కారణం ఏమిటి..?
30 సంవత్సరాలుగా నడిగర సంఘం బాధ్యతలు నిర్వహించిన పెద్దవాళ్లని...యంగ్ స్టర్స్ వచ్చి మీరు తప్పుకోండి అంటే వాళ్లు తట్టుకోలేరు కదా...అందుకే అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతా ఒకటే. ఎవరి మీద ఎలాంటి పగ లేదు.
మిమ్మల్ని ఓడించేందుకు చాలా ప్లాన్స్ వేసారట కదా..?
అవునండి..విశాల్ రెడ్డి తమిళియన్ కాదు..తెలుగోడు అంటూ నన్నుఓడించేందుకు నా పై ప్రచారం చేసారు. ఒక్క తెలుగోడు అనే కాదండీ...మన కులం కాదు..మన మతం కాదు అంటూ చాలా రకాలుగా ప్రచారం చేసారు. ఒక్క నల్లోడు అని అనలేదు కానీ...మిగతా అన్నిరకాలుగా నాపై ప్రచారం చేసారు.
మీరు నడిగర సంఘం బాధ్యతలు స్వీకరించాకా ఎలాంటి కార్యక్రమాలు చేసారు..?
నడిగరం సంఘం పేరుతో బ్యాంక్లో అప్పు ఉంది. ఆ అప్పును అంతా తీర్చేసాం. నడిగరం సంఘం అభివృద్దిలో భాగంగా భవనం నిర్మించాలనుకుంటున్నాం. అలాగే 5,000 ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది పేద కళాకారులు ఉన్నారు. వారందరికీ పెన్షన్స్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం.
నడిగరం సంఘం నిధులు కోసం సినిమా నిర్మించాలనుకుంటున్నారు కదా..?
అవును..సంఘం నిధులు కోసం నేను - కార్తీ ఇద్దరం కలసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఆతర్వాత జీవా, జయం రవి, సూర్య కూడా సంఘం నిధులు కోసం ఉచితంగా నటిస్తామన్నారు. నేను - కార్తీ కలసి నిజమైన కమర్షియల్ మూవీ చేయాలనుకుంటున్నాం. జనవరిలో ఈ చిత్రం ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాం.
ఇంతకీ పెళ్లి ఎప్పుడు..?
కళ్యాణ మండపం కట్టిస్తున్నాను. ఈ కళ్యాణ మండపాన్ని జనవరి 14 2018లో ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఇది జరిగిన నెక్ట్స్ రోజే అంటే జనవరి 15 2018లో నా పెళ్లి (నవ్వుతూ...)
హీరో..నిర్మాత అయ్యారు కదా...మరి డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు..?
నేను అదే అనుకుంటున్నాను...హీరో, నిర్మాత మాత్రమే కాదండీ...హీరో, నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్, నడిగర సంఘం సెక్రటరీ...ఇలా చాలా చేసాను కానీ..అసలైంది డైరెక్టర్ కాలేదు. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తాను.
డైరెక్షన్ చేస్తే...ఏ హీరోతో చేస్తారు..?
నేను ఎప్పుడు డైరెక్షన్ చేసినా నా సినిమాలో హీరో మాత్రం విజయ్.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే మిష్కిన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నేనే నిర్మిస్తున్నాను. ఆతర్వాత టెంపర్ రీమేక్ ప్లాన్ చేస్తున్నాను. అలాగే బాల దర్శకత్వంలో పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments