'డిటెక్టివ్ 2' ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశాల్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో , నిర్మాత అయిన విశాల్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం డిటెక్టివ్ 2. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ లుక్ తమిళ వెర్షన్‌కు మాత్రమే. తెలుగులో ఇంకా లుక్‌ను విడుదల చేయలేదు.
నిజానికి 2017లో విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిటెక్టివ్. దానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ఇది. మిస్కిన్ దర్శకత్వంలోనే సినిమా స్టార్ట్ అయ్యింది. ఎంటైర్ యూనిట్ లండన్ వెళ్లి చిత్రీకరణను స్టార్ట్ చేశారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో మిస్కిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దాంతో విశాల్ డైరెక్టర్‌గా మారక తప్పలేదు. ఈ సినిమా విషయంలో విశాల్, మిస్కిన్ మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్దం కూడా నడిచింది. తనకు విశాల్ నష్టపరిహారం చెల్లించాలని కూడా మిస్కిన్ విశాల్‌పై ధ్వజమెత్తారు. ఏదైతేనేం విశాల్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
డిటెక్టివ్ సినిమా అంతా ఇండియాలోనే సాగుతుంది. అయితే డిటెక్టివ్ 2 సినిమా మాత్రం లండన్‌లో కొనసాగుతుంది. మరి అద్వైతభూషణ్ ఈసారి కేసును ఎలాంటి కేసుని డీల్ చేస్తారు.. ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆష్య హీరోయిన్గా నటిస్తుంది. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో విశాల్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com