సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విశాల్..

  • IndiaGlitz, [Friday,January 22 2016]

హీరో విశాల్ సీక్వెల్ ప్లాన్ లో బిజీగా ఉన్నారు. ఇంత‌కీ..విశాల్ ఏ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నార‌నుకుంటున్నారా..? విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం పందెం కోడి. ఇప్పుడు ఈ సినిమాకే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు విశాల్. తెలుగు, త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన పందెం కోడి సినిమాకి సీక్వెల్ గా పందెం కోడి 2 ని లింగుస్వామి తెర‌కెక్కించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో తెలుగు, త‌మిళ న‌టీన‌టులు న‌టిస్తార‌ని స‌మాచారం. అలాగే పందెం కోడి సినిమా ఎక్క‌డైతే ఆగిందో...అక్క‌డ నుంచే పందెం కోడి 2 ప్రారంభం అవుతుంద‌ట‌. విశాల్ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తే బాగుంటుంద‌ని ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. అలాగే విల‌న్ పాత్ర కోసం స‌త్య‌రాజ్ ని సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం. మార్చిలో ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు. మ‌రి..పందెం కోడి రేంజ్ లో పందెం కోడి 2 కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.