విజయదశమి కానుకగా విశాల్‌ 'పందెం కోడి 2'

  • IndiaGlitz, [Thursday,August 30 2018]

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'పందెంకోడి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదల చేశారు. ఆగస్ట్‌ 31న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు.

మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి.

More News

శ్రీ హరికృష్ణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది - డా:టి.సుబ్బరామి రెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.

ద‌ర్శ‌కుడి విష‌యంలో మ‌రోసారి కంగ‌నా క్లారిటీ

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట‌య్యింది. సినిమా అంతా పూర్త‌య్యింది.

అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా  ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను , టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటు.