విశాల్ 'ఒక్కడొచ్చాడు' రిలీజ్ డేట్ మారింది

  • IndiaGlitz, [Thursday,November 10 2016]

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా న‌డుం క‌ట్టిన హీరోగా విశాల్ ఒక్క‌డొచ్చాడు చిత్రంలో క‌న‌ప‌డ‌నున్నారు.

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది. తమిళంలో కత్తిసండై పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాను న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను న‌వంబ‌ర్ 25న తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేస్తున్నార‌ని తెలిసింది. అధికార‌కంగా స‌మాచారం రావాల్సి ఉంది.

More News

యూరప్ లో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణ

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్) జెట్స్పీడ్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్లైన్తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌భ‌కు అంతా సిద్దం..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత‌పురంలో నేడు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అనంత‌పురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజ్ మైదానంలో ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసారు.

హేబా...బాయ్ ఫ్రెండ్స్ ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడంటే

టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

అక్కినేని అమ‌ల రీ ఎంట్రీ..!

అక్కినేని అమ‌ల శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు క‌దా..! మ‌ళ్లీ రీ ఎంట్రీ ఏమిటి అనుకుంటున్నారా..? విష‌యం ఏమిటంటే...తెలుగులో అమ‌ల‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రయోగాలు వద్దంటున్న యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.