విశాల్ కూడా రావడం లేదు..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు విశాల్ నటించిన తాజా చిత్రం కత్తి సాందాయ్. ఈ మూవీని తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. సూరజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే...500, 1000 నోట్ల రద్దు చేయడంతో...కొత్త సినిమాలను చూడాలని ఉన్నా...చేతుల్లో డబ్బులు లేక థియేటర్స్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితి.
ఈ కారణంగా చాలా సినిమాలు రిలీజ్ వాయిదా పడుతున్నాయి. విశాల్ కూడా ఒక్కడొచ్చాడు చిత్రాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ విషయాన్నివిశాల్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...కత్తి సాందాయ్ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ కాలేదు. ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాను. ఇప్పటికైతే ఈనెలలో రిలీజ్ లేదు థ్యాంక్యూ అంటూ సినిమా వాయిదా విషయాన్ని తెలియచేసాడు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com