స్పీడు మీదున్న విశాల్
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ ఈ శుక్రవారం `యాక్షన్` అనే చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించాడు. కాగా.. ప్రస్తుతం ఈ హీరో బ్రిస్టోల్‌లో ఉన్నాడు. అక్కడ తన సినిమా `డిటెక్టివ్`కు సీక్వెల్‌గా `డిటెక్టివ్ 2`ను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే విశాల్ తన మరో సినిమాను అనౌన్స్ చేశాడు. విశాల్ తదుపరి చిత్రం `చక్ర`. ఈ సినిమాను టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. పోస్టర్ చూస్తుంటే పక్కా యాక్షన్ థ్రిల్లర్‌లా సినిమా అనిపిస్తుంది. ఎం.ఎస్.ఆనందన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రెజీనా కసండ్ర, శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. డిటెక్టివ్ 2 తొలి షెడ్యూల్ ముగియగానే చక్ర సినిమా షూటింగ్‌లోనూ విశాల్ పాల్గొనబోతున్నాడట.
విశాల్ యాక్షన్ మూవీని సుందర్.సి డైరెక్ట్ చేశాడు. తమన్నా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో విశాల్ ఆర్మీ మేజర్ పాత్రలో నటించారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా విశాల్ చాలా బిజీగా ఉన్నాడు. అలాగే నడిగర్ సంఘం నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే విశాల్ అనీషా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments