విశాల్ 'విలన్' లుక్ అదిరిందిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ చిత్రాలతో తన కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. ఇప్పుడు మలయాళంలో కూడా నటించబోతున్నాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం విలన్‌లో విశాల్ విలన్‌గా కనపడనున్నాడనేది తెలిసిందే. మరో విషయమేమంటే విశాల్ ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనపడబోతున్నాడట. బబ్లీ బ్యూటీ హన్సిక విశాల్ క్లాస్ మేట్ పాత్రలో కనపడుతుంది. ఇప్పటి వరకు హీరోగానే తెరపై విలన్స్‌ను చితగొట్టిన విశాల్ తొలిసారి విలన్‌గా చేయనుండం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన విశాల్ లుక్‌ను విడుదల చేశారు. సినిమాకు `విలన్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయమేమంటే `విలన్` అనే పేరులో వి అక్షరం తమిళంలో ల అక్షరం తెలుగులో న్ అక్షరం మలయాళంలో ఉంది. మరి విశాల్ పాత్ర ఇంకెంత కొత్తగా ఉంటుందో మరి. ఉన్ని కృష్ణన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా విశాల్ మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com