విభేదాలపై ఘాటుగా స్పందించిన విశాల్..
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నైలో ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ వర్గం పై విశాల్ వర్గం పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరగడం..ఫలితాలు రావడం..కొత్త కమిటీ పదవులు చేపట్టడం కూడా జరిగింది. కానీ...శరత్ కుమార్ వర్గం - విశాల్ వర్గం మధ్య వార్ మాత్రం జరుగుతూనే ఉంది. ఇటీవల శరత్ కుమార్ నడిగర సంఘం నిధుల లెక్కలు చూపించలేదని విశాల్ వర్గం ఆరోపించింది. దీనిపై శరత్ కుమార్ సీరియస్ గానే స్పందించారు.
ఇదిలా ఉంటే..తాజాగా నడిగర్ సంఘంలో విభేదాలు వచ్చాయంటూ వదంతులు ప్రారంభమయ్యాయి. విభేదాల వదంతులపై విశాల్ ఘాటుగా స్పందించారు. నడిగర్ సంఘంలో విభేదాలా..? దమ్ముంటే తీసుకురండి..ఇప్పుడున్న టీమ్ ఒక కుటుంబంలా పని చేస్తుంది. ఈ సంఘానికి కొత్త భవనం కట్టించే వరకు మేము ఒక కుటుంబంలా ఉంటాం అంటూ ట్విట్టర్ లో స్పందించాడు విశాల్. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments