రానని చెప్పిన విశాల్ వచ్చేస్తున్నాడు
Thursday, December 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు విశాల్ నటించిన తాజా చిత్రం కత్తి సాందాయ్. ఈ మూవీని తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. సూరజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే...500, 1000 నోట్ల రద్దు చేయడంతో...కొత్త సినిమాలను చూడాలని ఉన్నా...చేతుల్లో డబ్బులు లేక థియేటర్స్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితి.
ఈ కారణంగా విశాల్ ఒక్కడొచ్చాడు చిత్రాన్ని వాయిదా వేసారు. ఈ విషయాన్నివిశాల్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...జనవరిలో రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే...ఈనెల 23న రిలీజ్ కావాల్సిన సూర్య సింగం 3 వాయిదా పడడంతో ఆ డేట్ లో విశాల్ వచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా విశాల్ తెలియచేసారు. మరి...అనుకోకుండా క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశాల్ ఒక్కడొచ్చాడు ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments