రానని చెప్పిన విశాల్ వచ్చేస్తున్నాడు

  • IndiaGlitz, [Thursday,December 15 2016]

తెలుగు, త‌మిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విశాల్ న‌టించిన తాజా చిత్రం క‌త్తి సాందాయ్. ఈ మూవీని తెలుగులో ఒక్క‌డొచ్చాడు టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు. సూరజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 18న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే...500, 1000 నోట్ల ర‌ద్దు చేయ‌డంతో...కొత్త సినిమాల‌ను చూడాల‌ని ఉన్నా...చేతుల్లో డ‌బ్బులు లేక థియేట‌ర్స్ కి వ‌చ్చి సినిమా చూడ‌లేని ప‌రిస్థితి.
ఈ కార‌ణంగా విశాల్ ఒక్క‌డొచ్చాడు చిత్రాన్ని వాయిదా వేసారు. ఈ విష‌యాన్నివిశాల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే...ఈనెల 23న రిలీజ్ కావాల్సిన సూర్య సింగం 3 వాయిదా ప‌డ‌డంతో ఆ డేట్ లో విశాల్ వ‌చ్చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా విశాల్ తెలియ‌చేసారు. మ‌రి...అనుకోకుండా క్రిస్మ‌స్ కి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విశాల్ ఒక్క‌డొచ్చాడు ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

More News

ఈనెల 23న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత‌ బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీ..మ‌రి మీరు..?

సినిమా రంగం పై అభిరుచి, ఆసక్తి ఉన్నా..చాలా మందికి అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను  ఎలా నిరూపించుకోవాలో తెలియని ప‌రిస్థితి. అందుక‌నే సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే  ఔత్సాహికుల కోసం జ‌గ‌ప‌తిబాబు 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పిన విష‌యం తెలిసిందే.

సూర్య సింగం 3 వాయిదా..!

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం సింగం 3.సింగం సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న సింగం3

2016 గూగూల్ హీరో ఇత‌నే..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టీవ్ గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. అందుక‌నే అనుకుంట‌...ఫేస్ బుక్ లో హైయ్య‌స్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న సౌత్ స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసారు.

చైతుతో మూవీ ఎనౌన్స్ చేసిన రానా..!

అక్కినేని నాగ‌చైత‌న్యకు న‌ట‌న మీదే కాకుండా నిర్మాణ రంగం మీద కూడా ఆసక్తి ఉంది. అందుక‌నే నాగ‌చైత‌న్య ఒక లైలా కోసం చిత్ర నిర్మాణం అంతా త‌నే ద‌గ్గ‌రుండి చేసుకున్నాడు.