విశాల్ సినిమా వాయిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్'తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలరిస్తారు. మాస్ హీరో విశాల్ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నారు కానీ..కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది.
సినిమాను జనవరి 26న తెలుగు, తమిళంలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments