విశాల్ పెళ్లి వెన్యూ ఫిక్స్!

  • IndiaGlitz, [Friday,January 11 2019]

తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోగా మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నాడు. సాధారణంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ వుంటారు. కానీ, విషయంలో అది రివర్స్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించిన తర్వాతే పెళ్ళి చేసుకుంటానని గతంలో చాలా సార్లు చెప్పారు.

ప్రస్తుతం అది నిర్మాణంలో ఉంది. దాంతో పాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా నిర్మాతల మండలి కోసం ఓ భవంతి కట్టిస్తున్నారు విశాల్. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. పెళ్లి కూడా ఖరారైంది. 'త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్ కూతురు అనీషాతో విశాల్ వివాహం చేయబోతున్నాం' అని విశాల్ తండ్రి, నిర్మాత జి.కె.రెడ్డి ప్రకటించారు.

దాంతో అది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నారంతా. కానీ ప్రేమ వివాహమే అని విశాల్ కన్‌ఫర్మ్ చేశారు. హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్‌రెడ్డి, పద్మజ కుమార్తె అనీషను విశాల్ పెళ్లాడనున్నారు. ‘‘మాది లవ్ మ్యారేజ్. వచ్చే వారంలో మా రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్‌మెంట్ డేట్‌ని ఫిక్స్ చేస్తారు. నిర్మాతల సంఘం నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక, అందులోనే పెళ్లి చేసుకుంటాను’’ అని విశాల్ పేర్కొన్నారు.

More News

16 ఏళ్ల తర్వాత...

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సౌందర్య, జగపతిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రాన్ని నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా హిందీలో కూడా కృష్ణవంశీ రీమేక్ చేశారు.

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ 'ఉండిపోరాదే..'

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో

ఫార్ములా సినిమానే కావాలి...

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.

ఓ లైఫ్ చూసినట్టుగా అనిపించింది - కృష్ణ

ఎన్టీఆర్ జీవితాన్ని 'యన్.టి.ఆర్' అనే బయోపిక్‌గా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయుకుడు' జనవరి 9న విడుద‌లైంది.

అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్.