విశాల్ సంతోషం
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్ పతాకంపై దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, డిస్ట్రిబ్యూటర్ ఎస్. నరసింహప్రసాద్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో నిర్మించిన 'జయసూర్య' విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌హిట్ టాక్‌తో విజయపథంలో దూసుకెళ్తోంది.
ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ - ''జయసూర్య' మళ్లీ తెలుగులో నాకు మంచి హిట్ అవడం చాలా ఆనందంగా వుంది. సుశీంద్రన్ కథ చెప్పినప్పుడే గ్యారంటీగా హిట్ సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకాన్ని తెలుగు ప్రజలు నిజం చేశారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ సబ్జెక్ట్ లోనే ఇది డిఫరెంట్ ఫిలిం అని అందరూ అప్రీషియేట్ చేస్తున్నారు.
ముఖ్యంగా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా 'జయసూర్య' చూసి నన్ను అభినందించడం చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. రఫ్‌గా కనిపించే ఇంటిలిజెంట్ పోలీస్ ఆఫీసర్‌గా జయసూర్య క్యారెక్టర్‌ని సుశీంద్రన్ చాలా బాగా డిజైన్ చేశారు. రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న జయసూర్య క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్‌గా ఎంతో సంతృప్తి కలిగింది. అలాగే సినిమా సూపర్‌హిట్ అవడంతో మళ్లీ సుశీంద్రన్ డైరెక్షన్‌లో ఎప్పుడు ఇంకో సినిమా చేస్తానా అనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ క్యారెక్టర్ చాలా సరదాగా సాగుతుంది.
అలాగే సముద్రఖని చేసిన పాత్ర కథలో చాలా కీలకమైనది. ఈ చిత్ర ఘన విజయానికి ఆ క్యారెక్టర్ కూడా ఎంతో దోహదపడింది. ఇమాన్ రీ రికార్డింగ్ సినిమాకి ప్రాణం పోసింది. తెలుగులో ఈ సినిమాని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో నాగేశ్వరరెడ్డిగారు, నరసింహ ప్రసాద్ గారు అందించి నాకు మరో పెద్ద హిట్ ఇచ్చారు. ప్రస్తుతం నేను 'పందెంకోడి-2' చిత్రాన్ని లింగుస్వామిగారి డైరెక్షన్‌లో చేస్తున్నాను. ఆ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను. 'జయసూర్య' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు నా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను'' అన్నారు. 'పందెంకోడి', 'పొగరు', 'పూజ' చిత్రాల తర్వాత మాస్ హీరో విశాల్‌కు 'జయసూర్య' మరో సూపర్‌హిట్ చిత్రం అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments